-
-
Home » Telangana » Mahbubnagar » Looking forward-MRGS-Telangana
-
ఎదురుచూపులే
ABN , First Publish Date - 2022-05-15T04:38:24+05:30 IST
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు మూడు నెలలు గడిచిపోయిన కూలి అంద లేదు.
- మూడు నెలలుగా అందని ఉపాధి కూలి
- కొత్త సాఫ్ట్ వేర్ వచ్చినా తప్పని తిప్పలు
- ఏప్రిల్ 20వరకు వచ్చాయంటున్న అధికారులు
గద్వాల, మే 14: ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు మూడు నెలలు గడిచిపోయిన కూలి అంద లేదు. వేసవిలో వ్యవసాయ పనులు లేక ఇంటిని గడు పుకోవడానికి ఉపాధి పనికి పోతే నెలలు కొద్ది కూలి ఇ వ్వకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని కూలీలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదా పు రూ. 7.50కోట్లకు పైగా కూలి డబ్బులు రావాల్సి ఉన్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉపాధి హామీ పథ కంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి వ్యవసాయ పనులు లేకపోవడం కూలీలు ఇళ్ల దగ్గరే ఉండటంతో పూటగడవడం కోసం ఉపాధి పను లకు వెళ్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చే యడం లేదు. జంగలి కటింగ్ (కంపతొలగింపు) ఫీడర్ చానల్లో సిల్ట్ తీయడం, చెరువులు, కుంటలలో పూ డికతీత, వ్యవసాయ పొలాలలో రాళ్ల ఏరివేత ఇలాంటి పనులు నిర్వహిస్తున్నారు. వారం వారం కూలీల మస్టర్‌ను సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేస్తున్నారు. టెక్నికల్ అ సిస్టెంట్లు కొలతలు తీసి ఇస్తున్నారు. కంప్యూటర్ ఆప రేటర్లు అంతేవేగంతో దానిని సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చే స్తున్నారు. కానీ ఇంత జరిగిన రోజులు గడిచిపోతు న్నాయి... కానీ కూలి డబ్బులు మాత్రం ఖాతాలో జమ కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలు 9లక్షల పనిదినాలు:
ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9లక్షలకు పైగా పనిదినాలు చేశారని అధికారులు లెక్కలు తీశా రు. ఫిబ్రవరిలో ఒకలక్ష, మార్చిలో 1.39లక్షలు, ఏప్రిల్ లో 6.62లక్షల పనిదినాలు (100రోజులు పూర్తయి న వారు రావడంతో పెరిగిన పనిదినాలు) జరిగినట్లు చె బుతున్నారు. గద్వాల జిల్లాలో సగటున కూలీ రోజుకు రూ.129నుంచి రూ. 136లు పడుతున్నది. ఇందులో వారం రోజుల కూలీ ఖాతాలో వేశారని కూలీలు చెబుతున్నా ఇంకా కూలి డబ్బులు కోట్లల్లోనే రావాల్సి ఉందని కూలీలు చెబుతున్నారు. కూలి డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో తిప్పలు:
రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న నరేగా సాఫ్ట్‌వేర్‌కు బదులు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసీని అమలు చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసిన వారం తర్వాత కూలి డబ్బులు నేరుగా ఖాతాల జమ అవుతాయని చెబుతు వచ్చారు. కానీ మూడు నెలలు అవుతున్నా డబ్బులు రావడం లేదని కూలీలు అంటున్నారు. ఇక్కడ మరో స మస్య ఏర్పడింది. కూలీలు జాతీయ బ్యాంకులు, పో స్టాఫీసులో ఖాతాలు ఉంటేనే డబ్బులు జమ అవు తు న్నాయి. లోకల్ బ్యాంకుల్లో ఖాతాలు తీసిన కూలీ ల కు డబ్బులు జమ కావడం లేదు. వీరందరిని తిరిగి జా తీయ బ్యాంకులు, పోస్టాఫీసులలో కొత్తఖాతాలు తీ యించే పనిలో ఉపాధి సిబ్బంది పడింది. ఇలాంటి వారికి కొత్తఖాతా తీసిన తర్వాతనే డబ్బులు జమ కానున్నాయి.
రెండు నెలలు గడిచిపోయింది
నేను ఉపాధి పనికి రాబట్టి రెండు నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూలీ డబ్బులు జమ కాలేదు. కానీ మొన్న వారం రోజుల డబ్బులు వచ్చాయి. మిగిలిన రోజులవి ఇప్పుడు ఇస్తారని అడిగితే వస్తాయి అంటున్నారు.
- సత్యమ్మ, ఉపాధికూలీ, బసల్చెరువు
పూట ఎట్లగడుస్తది
వ్యవసాయ పనులు లేక గవర్నమెంటు పనికి వచ్చినము. ఇల్లు గడవడమే కష్టం, చేసిన పనికి డబ్బులు ఇవ్వక పోతే ఎట్ల తినేదిసార్. వారం రెండు వారాలు అంటే సరే.. రెండు నెలలు అయిన కూలి ఇవ్వకపోతే కుటుంబం ఎట్ల పోషించాలి. వెంటనే డబ్బులు ఇవ్వాలి.
- మన్యమ్మ, ఉపాధికూలీ, బసల్చెరువు
ఏప్రిల్ 20వ తేదీ వరకు విడుదల
ఏప్రిల్ 20వ తేదీ వరకు కూలీలకు డబ్బు లు విడుదల చేశాం. అయితే, ఆ డబ్బులు కూలీల ఖాతాల్లో జమ కాలేదు. సం బంధిత బ్యాంకులు, పోస్టాఫీసు ల్లో ఉన్నట్లు తెలుస్తోం ది. వాటిని కూలీల ఖాతాలో వేసేటట్లు చూస్తాం.
- ఉమాదేవి, డీఆర్డీవో

