-
-
Home » Telangana » Mahbubnagar » Let us follow in the footsteps of Ambedkar-MRGS-Telangana
-
అంబేడ్కర్ అడుగు జాడల్లో నడుద్దాం
ABN , First Publish Date - 2022-05-15T04:07:53+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అ డుగు జాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
తిమ్మాజిపేట, మే 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అ డుగు జాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండల పరిధిలోని బుద్దసముద్రంలో శనివారం బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు, జడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌లతో కలిసి ఎమ్మె ల్యే గావించారు. అంతకు ముందు చిన్నారులు కోలాటాలు వేస్తూ ప్రదర్శనతో వారికి డప్పుమేళాలతో గ్రామస్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అదే విధంగా అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ రాణమ్మ, ఎంపీటీసీ బాలయ్య, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

