ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఫారెస్టు భూములకు పట్టాలివ్వాలి

ABN, First Publish Date - 2022-05-08T04:45:28+05:30

సంవత్సరాల తరబడి ఫారెస్టు భూములే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు ప్ర భుత్వం పట్టాలివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా


కొల్లాపూర్‌, మే 7: సంవత్సరాల తరబడి  ఫారెస్టు భూములే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు ప్రభుత్వం పట్టాలివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఫారెస్టు భూములకు పట్టా లివ్వాలని కోరుతూ కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాల యం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి వర్థం పర్వతాలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత గిరిజన బీసీలు సాగు చేసుకుంటున్న ఫారెస్టు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి నేటికీ ఎని మిదేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం కాలయాపన జ రుగు తుందే తప్ప న్యాయం జరగలేదన్నారు. మరో వైపు దళిత గిరిజన రైతులపై ఫారెస్టు అధికారుల దా డులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, రైతులు సాగు చేసు కుంటున్న పంటలు ధ్వంసం చేస్తున్నారని, ఫారెస్టు అ ధికారుల వేధింపులు లేకుండా భూముల్లో పంటలు వే సుకునేలా ప్రభుత్వం అనుమతులివ్వాలని, భూముల్లో బోర్లు వేసుకునే అవకాశం కల్పించాలని ప్ర భుత్వాన్ని కోరారు. ముక్కిడిగుండం, మొలచింతలపల్లి సరిహద్దు లో జిల్దార్‌తిప్ప చెరువుకు సాగునీరందించ డంలో పా లకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కోట్ల రూ పాయలు వెచ్చించి నిర్మించిన కేఎల్‌ఐ ప్రాజెక్టు, నిర్మి స్తున్న పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పక్కపక్కనే ఉన్నా నల్లమల గ్రామాలకు సాగునీరందడం లేదన్నారు. అదేవి ధంగా ఉడుములవాగుపై వంతెన నిర్మాణం పూర్తి చే యాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా నాయకులు ఈశ్వర్‌, మండల కార్యదర్శి శివవర్మ, రైతు సంఘం మండల కార్యదర్శి బాలపీరు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌, చంద్రునాయక్‌, బాలునాయక్‌, తేజానాయక్‌, శ్రీనునాయక్‌, నిరంజన్‌, మొత్తయ్య, అంబోతు శివ, బాలకృష్ణయ్య, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!