ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ఆరోపణలు

ABN, First Publish Date - 2022-05-15T04:31:26+05:30

నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు.

పేట డీసీసీ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నారాయణపేట, మే 14 : నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్‌ భవన్‌లో బ్లాక్‌ కాం గ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మాట్లాడారు. ఓడిపోయినా బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు కుంబం శివకుమా ర్‌రెడ్డిపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని, త్వరలో వారి కుట్రలను బట్టబ యలు చేస్తామన్నారు. 20 ఏళ్లుగా మచ్చలేని నాయ కుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న శివకుమార్‌ రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, దుష్ప్రచారాలను తిప్పికొ ట్టాలన్నారు. తమ నాయకుడికి అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని కర పత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సర్ఫరాజ్‌, హుస్సెన్‌, ఎండీ గౌస్‌, రవీందర్‌రెడ్డి, శరణప్ప, మహిమూద్‌ ఖురేషి, లిఖి రఘు, సదాశివారెడ్డి, బాల్‌రెడ్డి, నరహరి, శివకుమార్‌, విద్యాసాగర్‌, కృష్ణయ్య, సలీం, రమేష్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!