నకిలీ పత్తి విత్తనాలు విక్రయించొద్దు

ABN , First Publish Date - 2022-05-15T04:40:24+05:30 IST

నకిలీ పత్తి విత్తనాలు విక్రయించరాదని సెంట్రల్‌ టీం అధికారులు ఆదేశించారు.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయించొద్దు
వేముల సమీపంలోని గోదాంలో పత్తి విత్తనాలను పరిశీలిస్తున్న సెంట్రల్‌ టీం అధికారులు

- సెంట్రల్‌ టీం అధికారులు

- జిల్లాలో  విత్తన, ఎరువుల దుకాణాలు తనిఖీ


ఇటిక్యాల, మే 14: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించరాదని సెంట్రల్‌ టీం అధికారులు ఆదేశించారు. రానున్న వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గోదాంలలో ఉన్న  పత్తి విత్తనాల స్టాక్‌లను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామ శివారులో ఉన్న ఇమేజ్‌ క్రాప్‌ సైన్స్‌ కంపెనీ, మెగా చిల్డ్‌ కోల్డ్‌ స్టోరేజీ గోదాంలను సెంట్రల్‌ టీం అధికారులు జే తిరుపతినాయక్‌, లావణ్య, సీఐ శంకర్‌, అలంపూరు ఏడీఏ సక్రియా నాయక్‌, ఏవో మహ్మద్‌ అయుబ్‌ తనిఖీ చేశారు. పత్తి విత్తనాలను పరీక్షించగా, హెర్బిసైడ్‌ టాలరెంట్‌ నెగిటివ్‌ వచ్చింది. అలాగే స్టాక్‌ రిజిస్టర్‌లు, స్టాక్‌ పరిమాణం పరిశీలించారు. కల్తీ పత్తి విత్తనాలు విక్రయించినట్లు తెలిసినా, ఇళ్లల్లో స్టాక్‌ దొరికినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

  శాంతినగర్‌లో..

వడ్డేపల్లి: శాంతినగర్‌లోని సూర్య, శ్రీకృష్ణ పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌ దుకాణాలను శనివారం  సెంట్రల్‌ కమిటీ అధికారులు తిరుపతినాయక్‌, లావణ్య తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పత్తి విత్తనాల స్టాకును, స్టాక్‌ రి జిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం కాటన్‌ సంచుల నుంచి విత్తనాలను సేకరించి పరీక్షించారు.  దుకాణాల్లో అనుమతులు లేకుండా స్టాకులు పెట్టినట్లయితే సం బంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ శంకర్‌, ఏడీఏ సక్రియానాయక్‌, ఏవో రాధ ఉన్నారు. 

గద్వాల పట్టణంలో..

గద్వాల టౌన్‌  :  గద్వాల మండల విత్తన యూని ట్‌ను సెంట్రల్‌ స్క్వాడ్‌ టీం అధికారులు శనివారం త నిఖీ చేశారు.  యూనిట్‌లోని విత్తన స్టాకును, రికార్డుల ను పరిశీలించిన అధికారులు సిబ్బందికి తగు సూచన లు అందజేశారు. అనంతరం పట్టణంలోని ప్రైవేటు విత్తన దుకాణాన్ని తనిఖీ చేశారు. దుకాణంలోని వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను పరిశీలించి హెచ్‌టి టెస్ట్‌ చేశారు. అధికారుల బృందంలో హైదరాబాద్‌కు చెందిన సీడ్స్‌ ఏడీఏ జే. తిరుపతినాయక్‌, సీడ్‌ సర్టిఫికే షన్‌ అధికారి లావణ్య, మహబూబ్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ శం కర్‌, గద్వాల ఏడీఏ సంగీతలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి ప్రతాప్‌కుమార్‌ ఉన్నారు.  

అయిజ పట్టణంలో..

అయిజ : అయిజలోని విత్తన విక్రయ కేంద్రాలను, ప్రాససింగ్‌ ప్లాంట్లను సెంట్రల్‌ టీం సభ్యులు శనివారం తనిఖీ చేశారు.   నిల్వలు, బిల్‌ పుస్తకాలను, విత్తన ప్యాకెట్ల ఇన్వాయస్‌ పరిశీలించారు. విత్తన ప్యాకెట్లలోని విత్తనాలను పగలగొట్టి మరి పరీక్షించారు.  ఎ క్కడ కూడా ఎలాంటి అక్రమాలు బయటపడలేదని అధికారులు తెలిపారు.  కార్యక్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ తిరుపతినాయక్‌, సీఐ శంకర్‌ సీడ్‌  సర్టిఫికేషన్‌ అధికారి లావణ్య, అలంపూర్‌ వ్యవసాయాధికారి సక్రియానాయక్‌, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్‌ పాల్గొన్నారు. 

 ఉండవల్లిలో..

అలంపూర్‌చౌరస్తా: ఉండవల్లి మండల శివారులో ఉన్న వీకేర్‌ ప్రైవేటు విత్తన కేంద్రాన్ని సెంట్రల్‌ స్క్వాడ్‌ టీం అధికారులు తనిఖీలు చేశారు.  శనివారం  ఏడీఏ సక్రియనాయక్‌, ఇతర అధికారులతో కలిసి వారు పలు కోల్డ్‌సోరేజీలలో తనిఖీలు చేశారు. వీకేర్‌ స్టోరేజ్‌లో తెలంగాణ స్టేట్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కందుల ప్యాకింగ్‌ను పరిశీలించారు. అనుమతులు లేని విత్తన ప్యాకింగ్‌లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో స్క్వాడ్‌టీం ఏడీఏ తిరుపతినాయక్‌ , సీడ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీసర్‌ (ఎస్‌సీఓ) లావణ్య, స్వ్కాడ్‌టీం సీఐ శంకర్‌, ఉండవల్లి ఏవో సురేఖలు ఉన్నారు.



Read more