-
-
Home » Telangana » Mahbubnagar » Development of Telangana in all fields-MRGS-Telangana
-
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి
ABN , First Publish Date - 2022-05-15T04:18:14+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- మన ఊరు- మన బడి పనులకు శంకుస్థాపన
మూసాపేట, మే 14 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మూసాపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధి కోసం రూ. ఒక కోటీ 40 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో వాగుల గుండా 21 చెక్ డ్యాంల నిర్మాణంతో భూగ ర్భ జలాలు పెరిగి పోవడం తో రైతులు పంటలు పండించుకొని ఆనందంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జానం పేట సబ్ స్టేషన్ దగ్గరలో వోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వివిధ గ్రామాల రైతులకు ట్రాన్స్‌ఫార్మర్స్, స్తంభాలను అందజేశారు. అలాగే నిజాలా పూర్ గ్రామానికి చెందిన భీంసాగర్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మం జూరైన చెక్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతి, జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్యసాగర్, రైతుబంధు మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు జమీర్, పాఠశాలల హెచ్‌ఎంలు భాస్కర్, కవిత, నాయకులు మశ్చేందర్, కొండ య్య, సత్యనారాయణరెడ్డి, కలీం, చుక్క శేఖర్, వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గాజులపేట వాసుల వినతి
ప్రస్తుతం మహబూబ్‌నగర్ మండలంలో కొనసాగుతున్న తమ గ్రామాన్ని మూసాపేట మండలంలో కలపాలని శనివారం మూసాపేటలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి గాజులపేట గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో సర్పంచ్ చుక్క శేఖర్, ఎంపీటీసీ సభ్యుడు పెద్ద వెంకటయ్య, నాయకు లు రాజు, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
అడ్డాకులలో ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ
అడ్డాకుల : అడ్డాకుల సబ్‌స్టేషన్‌లో లో ఓల్టేజీ సమస్యతో బాధపడుతున్న తిమ్మాయిపల్లి, కందూరు, రాచాల, పెద్దమునుగాల్‌చెడ్ గ్రామాల రైతులకు శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా తిమ్మాయిల్లికి చెందిన మోహన్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2,50,000ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది, రైతులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో విద్యుత్ డీఈ కృష్ణమూర్తి, ఏఈ సుధాకర్, ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షు డు జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు రం గన్నగౌడ్, మండల కోఆప్షన్ ఖాజాఘోరి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సుజాత, టీఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శి జాజాల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ రైతుబంధు అధ్యక్షులు పాల్గొన్నారు.
కృత్రిమ కాలు కొనుగోలుకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
భూత్పూర్ : మండలంలోని కొత్తమొల్గర గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే ఆయన కుడి కాలును ఆసుపత్రిలో వైద్యులు తీసివేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం బాధితుడిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. కృత్రిమ కాలు కొనుగోలుకు గాను ఎమ్మెల్యే రూ.40వేలు అందించారు. అంతకు ముందు భూత్పూర్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, రైతు బంధు మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

