కేజీబీవీల్లో ప్రవేశాలకు డిమాండ్‌

ABN , First Publish Date - 2022-05-15T04:26:29+05:30 IST

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చేరేందుకు డిమాండ్‌ పెరిగింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థినులకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యాల యాలను ప్రారంభిం చాయి.

కేజీబీవీల్లో ప్రవేశాలకు డిమాండ్‌
మహ్మదాబాద్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 పాఠశాలలు 

నాణ్యమైన విద్య, మంచి భోజనం, కరాటే.. కుట్టులో శిక్షణ 

చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థినులు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 14: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చేరేందుకు డిమాండ్‌ పెరిగింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థినులకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యాల యాలను ప్రారంభిం చాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిఽధులు సమకూరు స్తున్నాయి. విద్యార్థినులకు నాణ్యమై చదువుతో పాటు, క్రమశిక్షణ, సామాజిక అంశాలు, క్రీడలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తు న్నారు. మూడు పూటలా మంచి భోజనం అందిస్తున్నారు. ఉచితం గా దుస్తులు, పుస్తకాలతో పాటు, బాలికలకు అవసరమైన కిట్‌ పంపిణీ చేస్తున్నారు. కరాటే, కుట్టుపని, అల్లికలు కూడా నేర్పుతున్నారు. దీంతో వీటిలో ప్రవేశాలకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి ప్రవేశాలు ప్రారంభమవుతాయి. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మీడియంలలో విద్యా బోధనకు కసరత్తు ప్రారంభించారు. ప్రవేశాలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.


తరగతికి 40 సీట్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 73 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఉన్నాయి. అందులో సగం విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో 16, నారాయణపేటలో 11, వనపర్తిలో 14, నాగర్‌క ర్నూల్‌ 20, జోగులాంబ గద్వాల జిల్లాలో 12 విద్యాలయాలు ఉన్నాయి. తరగతికి 40 మంది చొప్పున ప్రవేశాలు తీసుకుంటారు. దరఖాస్తుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొదటగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఆ తరువాత మిగిలిన విద్యార్థిలనులను తీసుకుం టారు. దరఖాస్తు పత్రంతో పాటు ఐదో తరగతి వరకు చదివిన బోనఫైడ్‌, టీసీ, ఆధార్‌కార్డు జిరాక్స్‌, విద్యార్థిని పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలు విద్యాలయంలో అందించాలి. ఒక్కో సీటుకు ఐదు నుంచి పది మంది వరకు పోటీ పడుతు న్నారని ఎస్‌వోలు చెబుతున్నారు. ఏ డు, ఎని మిది, తొమ్మిది, పది తర గతులకు సంబం ధించి ఖాళీగా ఉ న్న సీట్లను కూడా భర్తీ చేయను న్నారు.

Read more