అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-15T04:32:31+05:30 IST

చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జలాల్‌పూర్‌ చెక్‌పోస్టును తనిఖీ చేసి అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ

- ఎస్పీ వెంకటేశ్వర్లు జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు తనిఖీ

నారాయణపేట రూరల్‌/దామరగిద్ద, మే 14 : చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టుతో పాటు  దామరగిద్ద మండ లం కాన్‌కుర్తి చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. కర్నాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా ధాన్యంతో పాటు గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. ధాన్యం వాహనాలు వస్తే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆవులను అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని, వెటర్నరీ డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా మాత్రమే పశువులను సంతలకు తరలించాలన్నారు.

Read more