ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ముందస్తు పన్ను చెల్లింపు.. 33 శాతమే

ABN, First Publish Date - 2022-05-15T04:33:29+05:30

జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ముందస్తు పన్ను చెల్లించి ఐదుశాతం రిబెట్‌ పొందిన వారు కేవలం 33శాతం ప్రజలే ఉన్నారు.

నారాయణపేట పట్టణం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- అత్యల్పంగా కోస్గి పురపాలికలో 15 శాతం

- అత్యధికంగా పేట పురపాలికలో 40 శాతం చెల్లింపు

నారాయణపేట, మే 14 : జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ముందస్తు పన్ను చెల్లించి ఐదుశాతం రిబెట్‌ పొందిన వారు కేవలం 33శాతం ప్రజలే ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ప్రస్తుత ఏడాది అడ్వాన్స్‌ ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదుశాతం మినహయింపు గడువు ము గిసింది. ఈ గడువులో జిల్లాలో అత్యల్పంగా కోస్గి మునిసిపాలిటీలో 15శాతం మాత్రమే ప్రజలు పన్నులు చెల్లించగా, అత్యధికంగా నారాయణపేట మునిసిపాలిటీలో 40 శాతం ప్రజలు పన్నులు చెల్లించారు. మక్తల్‌ మునిసిపాలిటీలో 30శాతం పన్నులు చెల్లించారు. నారాయణపేట మునిసిపాలిటీలో 8,894 నివాసాలకు గాను ఐదు శాతం అర్హులు 5433 మందికి గాను ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.77 కోట్లు పన్నుల వసూళ్ల లక్ష్యానికి రూ.71.63 లక్షలు వసూళ్లతో 40శాతం పన్నులు వసూలు అయ్యాయి. గతేడాది 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.93 కోట్లకు గాను రూ.227.12 లక్షల వసూళ్లతో 81.21 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. కోస్గి మునిసిపాలిటీలో 5,963 నివాసాలకు ఐదు శాతం అర్హులు 4426 మంది ఉండ గా ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.54.38 లక్షల పన్నుల వసూళ్లకు రూ.8.19 లక్షలు వసూళ్లతో 15 శాతం వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.45.31 లక్షలకు రూ.31.11 లక్షల వసూళ్లతో 89శాతం లక్ష్యాన్ని అధిగమించారు. మక్తల్‌ ము నిసిపాలిటీలో 7799 నివాసాలు ఉండగా ఐదు శాతం అర్హులు 4795 నివాసాలకు గానూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.45.81 లక్షల పన్నుల వసూ ళ్ల లక్ష్యానికి రూ.13.78 లక్షలు వసూళ్లతో 30శాతం పన్నులు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.66.48 లక్షలకు రూ.51.42 లక్షల వసూళ్లతో 91శాతం లక్ష్యాన్ని అధిగ మించారు. జిల్లా వ్యాప్తంగా మూడు మునిసిపాలిటీలో 22,656 ని వాసాలకు ఐదుశాతం అర్హత 14,754 మందికి ఉండగా రూ.2.77 కోట్ల లక్ష్యం విధించారు. కాగా ముందస్తు చెల్లింపులకు ప్రజలు పెద్దగా మొగ్గు చూపక పోవడంతో రూ.93.60 లక్షలు వసూలుతో కేవలం 33 శాతమే పన్నులు వసూలు అయ్యాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!