కొనసాగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షలు
ABN , First Publish Date - 2022-05-15T05:17:55+05:30 IST
కొనసాగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 3,702 మంది విద్యార్థుల హాజరు
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మే 14 : జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన రెండో సంవత్సర మ్యాథమెటిక్స్ పేపర్-2 బీ, జువాలజీ పేపర్-2, హి స్టరీ పేపర్-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జి ల్లా ఇంటర్ విద్యాధికారి సమ్మెట సత్యనారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 4,163 మంది విద్యార్థులు హాజరు కానుండగా 3,702 (88.9 శాతం) మంది హాజరు కాగా 461 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇందులో జనరల్ విభాగంలో 2,752 మందికి గాను 2,528 హాజరుకాగా 224 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్ విభాగంలో 1,411 మంది విద్యార్థులు హాజరు కానుండగా 1,174 మంది హాజరు కాగా 237 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
నేడు మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష
మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : జిల్లాలో ఈ నెల 15న మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత పరీక్ష ఉంటుందని జిల్లా మైనార్టీ అధికారి బి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న అర్హత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్, తొర్రూరు, కురవిల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యమయితే అనుమతి ంచరని పేర్కొన్నారు.

