నేడు ఖమ్మం జిల్లాకు మంత్రి గంగుల కమలాకర్‌

ABN , First Publish Date - 2022-05-14T05:38:25+05:30 IST

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఉదయం 10:15గంటలకు బైపాస్‌రోడ్డు ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో బీసీ స్టడీసర్కిల్‌ భవనాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం 11గంటలకు వై

నేడు ఖమ్మం జిల్లాకు మంత్రి గంగుల కమలాకర్‌

పువ్వాడ అజయ్‌తో కలిసి పర్యటన

ఖమ్మం కార్పొరేషన్‌, మే 13 : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఉదయం 10:15గంటలకు బైపాస్‌రోడ్డు ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో బీసీ స్టడీసర్కిల్‌ భవనాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం 11గంటలకు వైరాలో వ్యవసాయ మార్కెట్‌యార్డును ప్రారంభించి, ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని సందర్శిస్తారు. 11:45 గంటలకు ఖమ్మంలోని డీపీఆర్‌సీ భవనలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటలకు రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో సీసీ రహదారులు, డ్రెయినేజీలను ప్రారంభిస్తారు.

Read more