ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పట్టణప్రగతిలో కార్పొరేషన్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ABN, First Publish Date - 2022-05-14T05:39:11+05:30

పట్టణప్రగతిలో భాగంగా మెరుగైన సేవలందించిన నగరపాలక సంస్థలు, పురపాలకాలకు రాష్ట్రప్రభుత్వం ఉత్తమ అవార్డులు ప్రకటించింది. ఈ క్రమంలో పారిశుధ్య నిర్వహణ, హరితహార కార్యక్రమ విజయవంతంతో ఖమ్మం నగరపాలక సంస్థ అవార్డకుఎంపికైంది. శుక్రవారం హైదారాబాద్‌లో జరిగి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 మునిసిపల్‌ విభాగంలో ఎంపికైన ఇల్లెందు

ఖమ్మం కార్పొరేషన్‌/ ఇల్లెందుటౌన్‌, మే 13 : పట్టణప్రగతిలో భాగంగా మెరుగైన సేవలందించిన నగరపాలక సంస్థలు, పురపాలకాలకు రాష్ట్రప్రభుత్వం ఉత్తమ అవార్డులు ప్రకటించింది. ఈ క్రమంలో పారిశుధ్య నిర్వహణ, హరితహార కార్యక్రమ విజయవంతంతో ఖమ్మం నగరపాలక సంస్థ అవార్డకుఎంపికైంది. శుక్రవారం హైదారాబాద్‌లో జరిగిన పట్టణ ప్రగతి వర్క్‌ షాప్‌లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నుంచి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఆ అవార్డును అందుకున్నారు. నగరంలో పట్టణ ప్రగతిపై మంత్రి పువ్వాడ చూపిన ప్రత్యేక శ్రద్ధ, కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, మేయర్‌ పునుకొల్లు నీరజ, సహాయ కమిషనర్‌ మల్లీశ్వరి నిత్య పర్యవేక్షణతో ఖమ్మం నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలోఅవార్డు సాధించగలిగింది. పట్టణ ప్రగతితో భాగంగా నగరంలో ఇంటింటి చెత్త సేకరణ మెరుగైంది. గతంలో నగరంలో 60వేల ఇళ్లనుంచి చెత్తసేకరించేవారు. పట్టణప్రగతిలో భాగంగా మరో 40వేలు మొత్తం లక్ష ఇళ్లనుంచి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. అలాగే 19పొడిచెత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంతో రహదారుల పక్కన చెత్త పేరుకుపోయే సమస్య తొలగింది. గతంలో 249 ప్రజా మరుగుదొడ్లు ఉండగా, మరో 165 నిర్మించారు. 41పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుతో పచ్చదనంతో కళకళలాడుతోంది. గతంలో రోజుకు 9కిలోమేటర్ల మేర డ్రైయిన్లను శుభ్రంచేస్తే ప్రస్తుతం 12కిలోమీటర్ల మేర డ్రైన్లు శుభ్రం చేస్తున్నారు. నర్సరీల ఏర్పాటునూ గణనీయంగా పెంచారు. గతంలో కేవలం రెండు నర్సరీలు ఉంటే, పట్టణప్రగతిలో భాగంగా మరో 12 నర్సరీలను ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులు తక్కువగా ఉన్నా పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించటంతో నగరపాలక సంస్థకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. అలాగే మునిసిపల్‌ విభాగంలో ప్రజా మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణలో ఇల్లెందు మునిసిపాలిటీకి రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం దక్కింది. ఈ మేరకు చైర్మన్‌ దమ్మాలపాటి వేంకటేశ్వరావు,  కమిషనర్‌ అంకుషావలి.. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ నుంచి అవార్డును అందుకున్నారు. అనంతరం చైర్మన్‌ దమ్మాలపాటి మాట్లాడుతూ పట్టణ అభివృద్దికి సహకరించి మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే హరిప్రియ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ అనుదీప్‌, ఇల్లందు మున్సిపల్‌ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!