పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-14T05:33:47+05:30 IST
మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు.
అధికారులకు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశం
మన ఊరు మన బడికి ఎంపికైన స్కూళ్ల పరిశీలన
అశ్వారావుపేట రూరల్/టౌన్, మే 13: మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. అశ్వారావుపేట, పేరాయిగూడెం, ఊట్లపల్లిలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా ఎంపికైన పాఠశాలలను శుక్రవారం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు, మన ఊరు మన బడిలో నమోదు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠళశాలల్లో స్లాబులు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్‌తో పాటు అన్ని విషయాలను పరిశీలించారు. ఏఏ పనులు చేయాలి, ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. విద్యార్థులకు సకల సౌకర్యాలతో విద్యను అందించేందుకు ప్రారంభించిన ఈకార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. పనులు ప్రారంభించిన పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఏఈ కృష్ణ, ఆర్‌ఐ అనిల్ పాల్గొన్నారు.

