ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘ఆ నలుగురి’పై ఎందుకంత ప్రేమ?

ABN, First Publish Date - 2022-05-14T05:32:16+05:30

పెద్దమ్మగుడిలో ఔట్‌ సోర్సిం గ్‌ నియామకాలలో అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కొంతమంది డబ్బులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పాల్వంచలోని పెద్దమ్మ గుడి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఔట్‌సోర్సింగ్‌ గుర్తింపునకు అధికారుల సిఫారసు

20 ఏళ్ల అనుభవం ఉన్న వారికి మొండి చేయి 

పాల్వంచ పెద్దమ్మగుడిలో నిబంధనలకు మంగళం

విచారణ నిర్వహిస్తాం: ఆంధ్రజ్యోతితో ఈవో

పాల్వంచ రూరల్‌, మే 13: పెద్దమ్మగుడిలో ఔట్‌ సోర్సిం గ్‌ నియామకాలలో అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కొంతమంది డబ్బులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీం తో దేవస్థానంలో తమ తండ్రులకు బదులుగా విధులు ని ర్వహించిన వారిని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను నిలుపుచేయాలని పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 20 ఏళ్లుగా తాము(23 మంది) దేవస్థానంలో పారిశుధ్య పనులు చేస్తున్నామని శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నా 2018 లో దేవా దాయశాఖ పారిశుధ్య కార్మికులుగా గుర్తించిందన్నారు. నెలకు రూ.2000 వేతనంతో సర్దుకుంటూ జీవనం సాగి స్తున్నామని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా పారిశుధ్య కార్మికు లుగా ఉన్న తమను అవుట్‌ సోర్సింగ్‌ కార్మి కులుగా గుర్తిం చాలని పలుసార్లు ఉన్నతాధికారులకు నివేదించుకున్నా మని అన్నారు. ఇటీవల కొందరు పూర్తిస్థాయి ఉద్యోగులు నలుగురు తమ ఆరోగ్య సమస్యల దృష్ట్యా వారు విధులకు హాజరుకాకుండా తమ పిల్లలు లింగంపల్లి అశోక్‌, రెడ్డిమల్ల సోమేష్‌, సిహెచ్‌ హరీష్‌, డి.విక్రమ్‌ను విధులకు పంపించా రని, మానవతా దృక్పథంతో తాము ఎటువంటి అభ్యంతరా లు చెప్పలేదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని కాదని ఆ నలుగురు కార్మికులకు మేలు చేయాలనే దరు ద్దేశ్యంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని ఉన్నతా ఽధికారులకు నివేదించారని వాపోయారు. నిబంధనలకు వి రుద్ధంగా నలుగురిని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను ఉన్నతాధికారులు నిలిపివే యాలని అన్నారు. తమ తండ్రులకు బదులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో ఇద్దరికి ప్రత్యేకంగా వేతనాలు చెల్లిం చినట్లుగా వినికిడి. ఈ విషయాలన్నింటిపై స్పష్టత రావా లంటే ముందుగా నలుగురిని విధుల్లోకి ఎలా తీసుకు న్నా రనేది తెలియాల్సి ఉంది. ఏ హోదాలో వారు విధులు నిర్వ హించారు? మిగిలిన కార్మికుల తీర్మానంతోనే ఔట్‌ సోర్సింగ్‌ జాబితాలో వారి పేర్లను పొందుపరిచారా? 20 ఏళ్లుగా పా రిశుధ్య కార్మికులుగా చేస్తున్న వారికి కాకుండా కొత్తగా విధుల్లో చేరిన ఆ నలుగురి పేర్లను జాబితాలో చేర్చేం దు కు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు ఉన్నాయా? అనే విషయాలు బహిర్గతం కావాల్సి ఉంది.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం

ఈ విషయంపై దేవస్థానం ఈవో సులోచనను వివరణ కోరగా ఈరోజే సమస్య నా దృష్ట్టికి వచ్చింది. పూర్తి స్థాయి లో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!