ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏది శిక్షణ.. ఎక్కడ కుట్టు మిషన్లు?

ABN, First Publish Date - 2022-05-15T05:21:31+05:30

అంతన్నారు. ఇంతన్నారు. కుట్టుమిషన్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిజ మేనని ఆ మహిళలు నమ్మారు.

అనంతోగులో శిక్షణకు వచ్చిన మహిళలు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉపాధి పేరుతో సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ మోసం

లాక్‌డౌన్‌ ఎత్తేసినా పత్తా లేని సంస్థ ప్రతినిధులు

తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని మహిళల డిమాండ్‌

ఆళ్లపల్లి, మే 14: అంతన్నారు. ఇంతన్నారు. కుట్టుమిషన్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిజ మేనని ఆ మహిళలు నమ్మారు. కానీ చెప్పింది వేరు. చేతల్లో చూపింది వేరు. ఫలితంగా ఆ గిరిజన మహిళలకు ఉపాధి దూరమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాల్లో ప్రతీ మహిళ వంటింటికే ప రిమితం కావద్దని, తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో ‘సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ మహి ళలకు శిక్షణతో పాటు అనంతరం కుట్టుమిషన్లు, ఇళ్లు కట్టుకునేందుకు రుణసదుపాయం కూడా ఇప్పిస్తామని ఆశ పెట్టింది. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా శిక్షణలేదు, కుట్టుమిషన్ల జాడలేదు. ‘సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు, అనంతోగు, రాయిపాడులో కొందరి మహిళలతో కమిటీని నియ మించింది. అంగన్‌వాడీ కేంద్రాలలో కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణకు వచ్చే మహిళల్లో (240 మంది మహిళలు)ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 550, మరోచోట రూ. 600 వరకు వసూలు చేసింది. 2020, ఫిబ్రవరి 12న ప్రజాప్రతినిధుల సమక్షంలో ‘సిటిజన్‌ డెవ లప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ ప్రతినిధులు కుట్టుమిషన్‌ శిక్షణ కార్యక్రమాన్నిఅట్టహాసంగా ప్రారంభించారు. శిక్షణలో మహిళలు చిన్నచిన్న అల్లికలు నేర్చుకుంటున్న క్ర మంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను నిర్ములించేందుకు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ‘సిటిజన్‌ డెవల ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ బాధ్యులు కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాలను మూసివేశారు. ప్రభుత్వం కరోనా నిబం ధనలు సడలిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేసినపట్టికి ఆయా కుట్టు మిషన్ల కేంద్రాలు మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. ఇక శిక్షణ కేంద్రంలో ఉండాల్సిన మిషన్లు సైతం కొందరికే పరిమితం చేశారని మహిళలు విమర్శిస్తు న్నారు. ఇ ప్పటికైనా సిటిజన్‌ డవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ బాధ్యులు కుట్టుమిషన్లలో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పిం చాలని, లేకపోతే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి ‘సిటిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ అనుబంధ సంస్థ ప్రతినిధులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!