ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సకాలంలో నాణ్యమైన బొగ్గును రవాణా చేయాలి

ABN, First Publish Date - 2022-05-15T05:24:12+05:30

వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో రవాణా చేయాలని ఏరియా అధికారులకు సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ చంద్రశేఖర్‌ సూచించారు.

కేసీహెచ్‌పీలో పర్యటిస్తున్న డైరెక్టర్‌ చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ చంద్రశేఖర్‌

మణుగూరుటౌన్‌, మే 14: వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో రవాణా చేయాలని ఏరియా అధికారులకు సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ఏరియా అధికారులతో కలసి శనివారం ఆయన మణుగూరులో పర్యటించారు. ఇందులో భాగంగా ఓసీ గనులను, కేసీహెచ్‌పీని సందర్శించారు. కేసీహెచ్‌పీలో నిర్మిస్తున్న ఆరువేల టన్నుల సామర్థ్యంగల బంకర్‌ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు, అధికా రులకు సూచించారు. దీంతో పాటు కేసీహెచ్‌పీలో జరుగుతున్న వ్యాగన్‌ లోడింగ్‌ ప్రక్రియను పరిశీలించి నాణ్యమైన బొగ్గు రవాణ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూ సకాలంలో రవాణా చేయాలన్నారు. అనంతరం పీకేవోసీ గనిని సందర్శించి ఓసీ-2 విస్తరణ పనులు పరిశీలించారు. మణుగూరు ఓసీ గని వ్యూ పాయింట్‌ నుంచి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు తొలి ప్రాధాన్యతనిస్తూ సింగరేణి ఆధారపడిన పరిశ్రమ లకు ఏక కాలంలో బొగ్గు రవాణా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందుస్తుగానే వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని, కాలువల నిర్మాణ పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం లలిత్‌కుమార్‌, కేపీయూజీ ఏజెంట్‌ నాగేశ్వరరావు, ఏజీఎం సివిల్‌ వెంకటేశ్వర్లు, మణుగూరు ఓసీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ శ్రీని వాసాచారి, పీకేవోసీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాముడు, పీకేఓసీ-2 మేనేజర్‌ రాంబాబు, మణుగూరు ఓసీ మేనేజర్‌ నర్సింహాస్వామి, డీజీఎం కేసీహెచ్‌పీ సురేష్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ షబ్బీరుద్దీన్‌ పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!