ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రంగులు, హంగులతో బడులు నడపలేరు

ABN, First Publish Date - 2022-05-14T06:18:52+05:30

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, బడులకు రంగులువేసి హంగూ ఆర్భాటాలతో ఎంతోకాలం నడపలేరని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు.

మాట్లాడుతున్న చావా రవి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 ఉపాధ్యాయుల సమస్యలను మరిచిన ప్రభుత్వం

 యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి

సత్తుపల్లి, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, బడులకు రంగులువేసి హంగూ ఆర్భాటాలతో ఎంతోకాలం నడపలేరని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు. శుక్రవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాక విద్యారంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని, 12రకాల మార్పులతో చేపడుతున్న పథకం మంచిదేనన్నారు. కానీ నిర్వహణ లేక మభ్య పెడుతూ ఎంతకాలం నడపగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విద్య కొనసాగాలంటే ముందు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ఈ నెల 16కల్లా విడుదల చేయాలని, లేదంటే 18న కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయలోకమంతా ధర్నా చేయనున్నట్లు తెలిపారు. 317జీవో తప్పులతడకగా ఉందని, భార్యాభర్తలు, సినియారిటీ, మ్యూచువల్‌ బదిలీలపై క్లారిటీ లేదన్నారు. నగదు రహిత వైద్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఉపాధ్యాయులకు ఈ రాష్ట్రంలో కరువైందన్నారు. 2శాతం ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్న ప్రభుత్వం టీఎన్‌జీవోల లేఖకు ప్రాధాన్యమిచ్చిందని, ఉద్యోగ సంఘాలతో మాట్లాడాల్సి ఉందన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో హక్కులకు భంగం కలుగుతుందని, విద్యారంగంలో అభివృద్ధి జరగాలంటే సమూల మార్పులకు శ్రీకారం చుట్టకతప్పదన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి. కిషోర్‌సింగ్‌, ఎన్‌.కృష్ణ, జిల్లా నాయకులు నరసింహారెడ్డి, బి. వెంకన్న, ఎన్‌.వీరబాబు, రాజశేఖర్‌, జే. .మురళీమోహన్‌, బాల నాగేశ్వరరావు, ఈశ్వరాచారి, శ్రీను, రాజేశ్వరరావు పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!