భూసేకరణ పనులు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-05-14T06:15:43+05:30 IST
భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశం
ఖమ్మం కలక్టరేట్ మే 13: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశమందిరంలో జాతీయ రహదారులు, నీటిపారుద ల, సీతారామ ప్రాజెక్ట్, రైల్వేలైను పనుల పురోగతిపై శుక్రవారం సంబందింత ఇంజనీరింగు, రెవె న్యూ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, రెవెన్యూ, సింగరేణి, తహసీల్దా ర్లు, ఇంజనీరింగు అధికారులతో భూసేకరణ పనులపై కలెక్టర్ గౌతమ్ సమీక్షా నిర్మహించారు. జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారులు, సీతారామ ప్రాజెక్ట్ రైల్వేలైను పనులకు ఇప్పటికే జరిగిన భూసేకరణకు సంబంధించి భాదితులకు పరిహారం అందించడం ఇంక ను పెండింగు ఉన్న పరిహారం చెల్లింపు ఇంకను చేయవ లసిన భూసేకరణతోపాటు జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఖమ్మం, కల్లూరు, రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాధ్, సూర్యనారాయణ, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎల్.ఎ.దశరధ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు, వి.రాము, దక్షణమధ్య రైల్వేస్ మనోజ్‌కుమార్, సూర్య నా రాయణ, కె.వెంకటేశ్వరరావు, జాతీయ రహదారు ల ప్రాజెక్టు డైరెక్టర్ వి.దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.యుగందర్, మేనేజర్ కె.దివ్య, సింగరేణి జిఎమ్ ఎస్‌సిసిఎల్ సిహెచ్. నరసింహారావు, ఎ.వి.ఆంజనేయులు, నంబందిత ఏజెన్సీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

