ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే కేసీఆర్ సర్కార్ ప‌నిగా పెట్టుకుంది: vijayashanthi

ABN, First Publish Date - 2022-05-12T01:43:29+05:30

అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే కేసీఆర్ సర్కార్ ప‌నిగా పెట్టుకుంది: vijayashanthi

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు vijayashanthi విమర్శలు గుప్పించారు. KCR స‌ర్కార్ పేరుకు మాత్రం ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని చెప్పుకోవ‌డం... చేసేది మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డమే అని ఆమె ఆరోపించారు. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ ప‌నిగా పెట్టుకుందని, గత ప్ర‌భుత్వం పేద‌ల‌కు.. ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..


''కేసీఆర్ స‌ర్కార్ పేరుకు మాత్రం ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని చెప్పుకోవ‌డం... చేసేది మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ ప‌నిగా పెట్టుకుంది. గత ప్ర‌భుత్వం పేద‌ల‌కు... ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అయితే జీవనోపాధిని కొనసాగించాలని... అమ్ముకోవడానికి వీల్లేదని చిన్న క్లాజు పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసైన్డ్ భూములపై దృష్టిపెట్టి వాటిని లాక్కోవడమే పనిగా పెట్టుకున్నడు. ఇందులో ప్ర‌భుత్వ అధికారుల ముఖ్య‌ పాత్ర ఉంది. అన్ని జిల్లాల్లో నిషేధిత భూమిని ప్ర‌భుత్వ‌ అధికారులే తెల్లకాగితాలపై రాయించుకుంటున్నరు. బెదిరించి, నిషేధిత జాబితాలో ఉన్నయని భయపెట్టి... బెదిరించి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో భూములు కొనేశారు. బ్లాక్ మెయిల్ చేసి అసైన్డ్ భూములు లాక్కుని... వాటితో వేరే రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 90 శాతం భూమి రైతుల వద్ద లేదు. అంతా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆక్రమణలోనే ఉన్నాయి. కేసీఆర్... నీ అక్ర‌మాలు ఎంతో కాలం సాగ‌వు. తొంద‌ర్లోనే నీ స‌ర్కార్‌కు, నీ కారుకు తెలంగాణ ప్ర‌జానీక‌మే త‌గిన బుద్ధి చెబుతుంది.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-05-12T01:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!