తెలంగాణకు వస్తున్న అమిత్ షాపై Kavitha ప్రశ్నల వర్షం..

ABN , First Publish Date - 2022-05-14T15:19:21+05:30 IST

‘ప్రజల గోస- బీజేపీ భరోసా’ పేరిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌..

తెలంగాణకు వస్తున్న అమిత్ షాపై Kavitha ప్రశ్నల వర్షం..

హైదరాబాద్ సిటీ : ‘ప్రజల గోస- బీజేపీ భరోసా’ పేరిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ఇవాళ్టితో ముగియనున్నది. ఈ సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రానికి వస్తున్న షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ట్విట్టర్ (Twitter) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ కవిత అడిగిన ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం.


ఇవీ ప్రశ్నలు..

- 3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు..?

- బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ 1350 కోట్లు, GST పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి..? 

- ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటి..?

- బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి..? అని కవిత ప్రశ్నలు సంధించారు.


తెలంగాణ బిడ్డలకు చెప్పండి.. జీ..!

అంతేకాకుండా.. అమిత్ షా జీ గత 8 సంవత్సరాల్లో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్,  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా..? అని షాను కవిత ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్లను కవిత అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున లైక్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తుండగా.. బీజేపీ (BJP) వీరాభిమానులు మాత్రం రివర్స్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటూ కౌంటర్‌లు ఇస్తున్నారు. కాగా.. ఈ ప్రశ్నలపై అమిత్ షా.. రాష్ట్ర కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.Read more