అమ్మకు నిరీక్షణ

ABN , First Publish Date - 2022-11-07T01:02:43+05:30 IST

ప్రజా ఆరోగ్యంతోపాటు ప్రభుత్వాస్పత్రులపై ప్రజ లకు నమ్మకం పెంచేందుకు తెలంగాణ సర్కారు అనే క కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధానంగా మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులు ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తోంది.

        అమ్మకు నిరీక్షణ
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి

- ప్రభుత్వాస్పత్రుల్లో కేసీఆర్‌ కిట్‌

- జిల్లాలో 10 వేల మంది ఎదురు చూపులు

- బకాయిలు రూ.8.38 కోట్లు

- కిట్‌లతోనే సరిపుచ్చుతున్న ప్రభుత్వం

- ప్రభుత్వాస్పత్రుల్లో పెరుగుతున్న ప్రసవాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రజా ఆరోగ్యంతోపాటు ప్రభుత్వాస్పత్రులపై ప్రజ లకు నమ్మకం పెంచేందుకు తెలంగాణ సర్కారు అనే క కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధానంగా మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులు ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. పౌష్టికాహారం అందించడం కోసం గర్భిణులకు నగదు ప్రోత్సాహాన్ని కూడా ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం సత్ఫలితాలు ఇస్తున్నా ప్రస్తుతం నగదు ప్రోత్సాహం కోసం మాత్రం నిరీక్షించక తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పథకం ఏర్పడిన నాటి నుంచి దాదాపు 28 వేల మంది గర్భిణులు పథకంలో చేరారు. ప్రస్తుతం పది వేల మంది వరకు వివిధ సేవలకు సంబంధించిన నగదు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు. మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు తల్లి ఖాతాలో నాలుగు విడతల్లో జమ చేస్తున్నారు. నిధుల విడుదలలో జాప్యంతో జిల్లాలో దాదాపు పది వేల మంది గర్భిణులు ఏడాదిగా నగదు, బదిలీ లేక ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల పెంపు నకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా నగదు బదిలీపై మాత్రం నిర్లక్ష్యమే కనిపిస్తోది.

జిల్లాలో బకాయిలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గర్భిణులు కేసీఆర్‌ కిట్‌ పథకంలో చేరుతున్నారు. ప్రసవమైన తరువాత శిశువుకు ఉపయోగపడే వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌ మాత్రం వెంట, వెంటనే అందిస్తున్నారు. జిల్లా వార్షిక లక్ష్యం 10154 మంది గర్భిణులను నమోదు చేయాలనే లక్ష్యంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్‌ నుంచి మార్చి 2022 వరకు 9031 మంది గర్భిణులు కేసీఆర్‌ కిట్‌ పథకంలో నమోదయ్యారు. 89 శాతం లక్ష్యాన్ని సాధించారు. కేసీఆర్‌ కిట్‌కు సంబంధించిన నగదు బదిలీ బకాయిలు మాత్రం జిల్లాలో రూ.8.38 కోట్ల వరకు ఉంది. నాలుగు విడతలుగా అందించనున్న ప్రోత్సాహంలో మొదటి విడతలో రూ.3 వేలు, రెండో విడతలో మగబిడ్డకు రూ.4 వేలు, ఆడబిడ్డకు రూ.5 వేలు, మూడో విడతలో రూ.2 వేలు, నాలుగో విడతలో రూ.3 వేలు తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 28,761 మంది చేరారు. వీరిలో 8,387 మందికి ప్రోత్సాహం అందాల్సి ఉంది. ప్రసవాలకు సంబంధించి 14,551లో 4540 మంది, ఇమ్యూనైజేషన్‌లో మూడో విడతలో 27,812 మందిలో 7,943 మంది, నాలుగో విడతలో 24,709 మందిలో 7,437 మందికి నగదు ప్రోత్సాహం అందాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు నగదు ప్రోత్సాహం కింద మొదటి విడతలో 20,374 మందికి రూ.6,11,22,000, రెండవ విడతలో 10,011 మందికి రూ.4,48,73,000, మూడవ విడతలో 19,869 మందికి రూ.3,97,38,000, నాల్గవ విడతలో 17,272 మందికి రూ.5,18,16,000 ప్రోత్సాహాన్ని ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం నగదు ప్రోత్సాహం అందాల్సి ఉంది.

Updated Date - 2022-11-07T01:02:43+05:30 IST

Read more