-
-
Home » Telangana » Karimnagar » The grain buying process should be expedited-NGTS-Telangana
-
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-14T05:34:47+05:30 IST
యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లై మం త్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు వినతి ప త్రం సమర్పించారు.
మంత్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక వినతి
జగిత్యాల అర్బన్, మే 13: యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లై మం త్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు వినతి ప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిధాన్యం కొ నుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, కొనుగోలు ప్రక్రియ ను వేగవంతం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో ఎక్కడికక్కడ కొ నుగో లు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయినందున వెంటనే ధాన్యం తూకం వేసి, తక్‌పట్టి వెంటనే ఇచ్చేలా అఽధికారులకు ఆదేశాలు ఇవ్వాల ని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో రంగు మారి న ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకునేలా చూడాలని, ఖాళీలేనిచో ఏఎంసీ ఽగోదాంల లో ధించుకునేలా అనుమతులు ఇచ్చేలా అధికారులు ఆదేశాలు జారీ చే యాలని కోరారు. అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు మమిడి నారాయణ రెడ్డి, గురిజెల రాజిరెడ్డి, కొట్టాల మోహన్‌రెడ్డి, ఎలిశెట్టి గంగారెడ్డి, సాయిరెడ్డి, బందెల మల్లయ్య, వేముల విక్రమ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వామన్‌రెడ్డి నారాయణ తదితరులున్నారు.

