ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ

ABN, First Publish Date - 2022-05-14T06:09:36+05:30

కుటుంబ కలహాలతో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు.

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రవీందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- కుటుంబ కలహాలతో హతమార్చిన అల్లుడు 

- వివరాలు వెల్లడించిన డీసీపీ రవీందర్‌

మంథని, మే 13: కుటుంబ కలహాలతో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు. వృద్ధు లు అనే కనికరం లేకుండా రోకలిబండతో బాది హతమార్చాడు. మంథని మండలం పుట్టపాక గ్రామపంచాయతీ పరిధి చల్లప ల్లిలో వృద్ధ దంపతులు ఈనెల 10న దారు ణ హత్యకు గురయ్యారు. భూతగాదాలే కారణమంటూ వారి కొడుకు రవి బంధువు లపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంచలనం రేపిన ఈ కేసును మంథని పోలీసులు 48 గంటల్లో ఛేదించా రు. అల్లుడే అసలు హంతకుడని తేల్చారు. శుక్రవారం మంథని పోలీసుస్టేషన్‌లో పెద్ద పల్లి డీసీపీ రవీందర్‌ నిందితుడి అరెస్టు చూపడంతోపాటు సంఘట వివరాలు వెల్ల డించారు. చల్లపల్లిలో ఈనెల 10న తెల్లవా రుజామున కొత్త సాంబయ్య, లక్ష్మిలను వారి రెండో అల్లుడు పెంట శ్రీనివాస్‌ దారు ణంగా హత్య చేసినట్లు తెలిపారు. హత్య కు గురైన సాంబయ్య, లక్ష్మిల రెండో కూతు రు వసంతను మంథని మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన పెంట శ్రీనివాస్‌కు ఇచ్చి 2010లో వివాహం చేశా రు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో శ్రీని వాస్‌ హమాలీగా పనిచేస్తున్నాడు. మద్యా నికి బానిసైన శ్రీనివాస్‌ కంపెనీలో పని సరిగ్గా చేయకపోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. పలుసార్లు ఈ విషయంలో అత్తమామలు, కుటుంబసభ్యు లు పంచాయతీలు నిర్వహించి శ్రీనివాస్‌ను పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈనెల 6న సైతం శ్రీనివాస్‌, వసంతల మధ్య గొడవ జరిగింది. బావమర్ది రవి హైదరాబాద్‌కు వెళ్లి బషిరాబాద్‌ పోలీసు స్టేషన్‌తో తన సొదరి వసంతతో కలిసి శ్రీనివాస్‌పై ఫిర్యా దు చేశాడు. ఈనెల 10న పనికి వెళ్లకుండా ఇంట్లో శ్రీనివాస్‌తో భార్య వసంత పనికి ఎందుకు వెళ్లడం లేదని అడగగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపంగా ఇంట్లో నుంచి బయటకు వస్తూ శ్రీనివాస్‌.. నిన్ను, మీ అమ్మనాన్నల అంతు చూస్తాని హెచ్చరించి వెళ్లిపోయాడు. బావ మరిది రవిని తరచూ తన ఇంటికి పంపు తుండటంతో గొడవలు ఎక్కువ అవుతున్నా యని భావించిన శ్రీనివాస్‌ తన అత్తమా మలను చంపాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌ నుంచి ఈనెల 11న తెల్లవా రుజామున చల్లపల్లికి చేరుకొని ఆరుబయ ట పడుకున్న మామ సాంబయ్యను కూల ర్‌ దగ్గర ఉన్న రోకలిబండతో తలపై బలం గా కొట్టాడు. సాంబయ్య చనిపోయినట్లు నిర్ధారించుకొని ఇంటి తలుపులు కొట్టగా అత్త లక్ష్మి తలుపులు తీసింది. చేతిలో ఉన్న రొకలిబండతో ఆమె తల, ముఖంపై బలం గా కొట్డంతో మృతిచెందింది. ఇంట్లో ఉన్న రూ.20 వేలు తీసుకొని పారిపోతూ రొకలి బండను ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడవేశాడు. వెంకటాపూర్‌లో నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేయగా, హత్య చేసిన ట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడి నుంచి రొకలిబండ, ఫోన్‌, రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నా మన్నారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ ఆధ్వర్యంలో 48 గంటల్లోనే హత్య కేసును చేధించిన మంథని సీఐ సతీష్‌, ఎస్‌ఐ చంద్రకుమార్‌లను డీసీపీ రవీందర్‌ ప్రత్యే కంగా అభినందించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!