పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-11-08T00:30:09+05:30 IST

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి ఎనలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. బోయినపల్లి మండలంలోని గూడెంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వినోద్‌కుమార్‌తోపాటు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి పాల్గొన్నారు.

 పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వినోద్‌కుమార్‌

బోయినపల్లి, నవంబరు 7: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి ఎనలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. బోయినపల్లి మండలంలోని గూడెంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వినోద్‌కుమార్‌తోపాటు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వైకుంఠధామం శిలాఫలకాన్ని అవిష్కరించారు. అనంతరం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగిజావా పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ నాగయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లెంకల సత్యనారాయణరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చెన్నాడి అమిత్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:30:09+05:30 IST

Read more