సబ్సిడీపై విత్తనాలు పంపిణీ

ABN , First Publish Date - 2022-05-14T06:10:48+05:30 IST

డీసీఎమ్‌ఎస్‌ గోదాంలో 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు.

సబ్సిడీపై విత్తనాలు పంపిణీ
విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

పెద్దపల్లి టౌన్‌, మే 13: డీసీఎమ్‌ఎస్‌ గోదాంలో 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సాగు వల్ల భూసారం అత్యధిక శాతంలో పెరుగుతుందన్నారు. రైతులందరు పచ్చిరొట్ట విత్తనాల సాగు చేసి తమ భూములను అధిక దిగుబడులు ఇచ్చే విధంగా చేసుకోవాలని సూచించా రు. ఎంత సారవంతంగా ఉంటే పంటలు అంతగా రక్షించబడుతాయన్నారు. దీంతో మందుల ఖర్చు పెద్దమొత్తంలో తగ్గుందని వివరించారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాస్‌, బండారి రాంమూర్తి, ఆదిరెడ్డి, శ్రీనివాస్‌, అలివేణి, ఆత్మ తదితరులున్నారు.

Read more