ఎన్టీపీసీ భూనిర్వాసితుల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-14T06:08:28+05:30 IST

రామగుండం ఎన్టీపీసీలో జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భూనిర్వాసితులు శుక్రవారం ఆందోళన చే శారు.

ఎన్టీపీసీ భూనిర్వాసితుల ఆందోళన
ఆందోళన చేస్తున్న భూనిర్వాసితులు

- బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపణ

జ్యోతినగర్‌, మే 13 : రామగుండం ఎన్టీపీసీలో జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భూనిర్వాసితులు శుక్రవారం ఆందోళన చే శారు. భూనిర్వాసితులు ప్రాజెక్టు ప్రధాన గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదా లు చేశారు. ఉద్యోగాల భర్తీలో అవకతవకులు జరిగాయని, కొత్తగా నమోదు చే యించుకున్న భూనిర్వాసిత అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి ఉద్యోగాల కోసం అవస్థలు పడిన సీనియర్‌ భూనిర్వాసిత అభ్యర్థులకు ఉద్యోగాల ఎంపికలో అవకాశమివ్వలేదన్నారు. ఆరు నెలల క్రితమే భూనిర్వాసితులుగా కొంత మంది లోపాయికారిగా నమోదు చేయించుకున్నారని, వారిని ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. అలాగే రిజ ర్వేషన్ల అమలుకు సంబంధించి సక్రమంగా వ్యవహరించలేదని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థు లను జనరల్‌ కోటాలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం అనుమానాలకు తావిస్తోం దన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు న్యాయం చే యాలని భూనిర్వాసితులు వెంకటేశ్‌, ప్రభాకర్‌, ధర్మపురి తదితరులు కోరారు. 

Read more