ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ధర్మపురిలో వైభవంగా అన్నకూటోత్సవం

ABN, First Publish Date - 2022-05-14T05:31:53+05:30

నరసింహ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో అన్నకూట వోత్సవం, పల్లవోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

నవరాత్రోత్సవాల సందర్భంగా స్వామి వారలకు పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ధర్మపురి, మే 13: నరసింహ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో అన్నకూట వోత్సవం, పల్లవోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7 నుంచి ఆరంభ మైన శ్రీ నరసింహ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ తదితర వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు స్వామి వారలకు పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నకూటోత్సవంలో భాగంగా ఉద యం పలు రకాల ప్రసాదాలు, పండ్లతో మహా నివేదన, సప్త హా రతులు, భజనా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నకూటోత్సవం కో సం దాత, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కస్తూరి శ్రీధర్‌ రూ 25,000 ఆలయానికి విరాళం ఇచ్చారు. సాయంత్రం పల్లవోత్సవం, వసంతో త్సవం కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఆలయ మండపంలో ప్ర త్యేక వేదిక ఏర్పాటు చేశారు. గోధూళి సుమూహూర్తాన అర్చకులు స్వామి వారల ఉత్సవ మూర్తులను ప్రత్యేక పీఠ పైకి తీసుక వచ్చి ఆశీనులు చేశారు. అనంతరం పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాది కార్యక్రమాలు జరిపి పల్లవోత్సవం, వసంతోత్స వం కార్యక్రమాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వార లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంక టాల శ్రీనివాస్‌, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్‌, ఎంపీపీ  రాజమణి, మున్సి పల్‌ వైస్‌చైర్మన్‌ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, ముఖ్య అర్చకులు, రినోవేషన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!