ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తెలంగాణపై సవతి ప్రేమ నిజం కాదా?

ABN, First Publish Date - 2022-05-14T08:34:50+05:30

తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తాను అడిగే ప్రశ్నలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • విభజన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
  • చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి
  • అమిత్‌షాకు 27 ప్రశ్నలతో కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తాను అడిగే ప్రశ్నలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. విభజన చట్టంలోని హామీల కోసం తెగేదాకా కొట్లాడటం తమ బాధ్యత అని, అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలక అంశాలను మీ దృష్టికి తెస్తున్నానంటూ షాకు బహిరంగ లేఖ రాశారు. మొత్తం 27 ప్రశ్నలను అందులో పొందుపర్చారు. ‘‘గుజరాత్‌పై వల్లమాలిన ప్రేమ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ నిజం కాదా? తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు ఆగమేఘాలపై నిధులు కేటాయించడం దేనికి సంకేతం’’ అని నిలదీశారు. ఇలాగైతే తెలంగాణ ప్రజాక్షేత్రంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘విభజన చట్టంలోని ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కాజీపేట్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏమైంది? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా చెబుతారా? మెడికల్‌ కాలేజీలు ఎందుకు మంజూరు చేయలేదు? అంటూ పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని దుయ్యబట్టారు. వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. పత్తా లేకుండా పోవుడు బీజేపీ అగ్ర నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!