ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Vedic Education: వేద విద్యను ప్రతి ఒక్కరూ ఆదరించాలి: విద్యా గణేశానంద భారతీ స్వామి

ABN, First Publish Date - 2022-11-07T19:14:19+05:30

హైదరాబాద్: గాయత్రీ బ్రాహ్మణ పరిషత్, చింతల్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, హెచ్ఎమ్‌టీ కాలనీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన జరిగింది.

Vidya Ganeshananda Bharathi Swami
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: గాయత్రీ బ్రాహ్మణ పరిషత్, చింతల్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, హెచ్ఎమ్‌టీ కాలనీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన జరిగింది. ఇందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, ధన్వంతరి హోమం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం, సామూహిక లలితా సహస్ర నామ పారాయణ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విద్యా గణేశానంద భారతీ స్వామి విచ్చేసి తమ అనుగ్రహ భాషణంలో ధర్మ రక్షణ ప్రతీ ఒక్కరి ధ్యేయంగా సమాజం అడుగులు వేయాలని సందేశం ఇచ్చారు. వేద విద్యను ప్రతీ ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో నిత్య ధర్మాచరణ అత్యంత కీలకమని అప్పుడే ధర్మ రక్షణ సాధ్యమని స్వామి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం కొండా మోహన శర్మ, చింతలపాటి రామ్ ప్రసాద్, ఉమా శంకర శర్మ ఆధ్వర్యంలో జరిగింది. వక్తలు తెన్నేటి హరీశ్, సూర్య కిరణ్ శర్మ ధర్మాచరణ ప్రాధాన్యత వివరించారు.

Updated Date - 2022-11-07T19:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!