Vedic Education: వేద విద్యను ప్రతి ఒక్కరూ ఆదరించాలి: విద్యా గణేశానంద భారతీ స్వామి
ABN , First Publish Date - 2022-11-07T19:14:19+05:30 IST
హైదరాబాద్: గాయత్రీ బ్రాహ్మణ పరిషత్, చింతల్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, హెచ్ఎమ్‌టీ కాలనీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన జరిగింది.
హైదరాబాద్: గాయత్రీ బ్రాహ్మణ పరిషత్, చింతల్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, హెచ్ఎమ్‌టీ కాలనీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన జరిగింది. ఇందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, ధన్వంతరి హోమం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం, సామూహిక లలితా సహస్ర నామ పారాయణ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విద్యా గణేశానంద భారతీ స్వామి విచ్చేసి తమ అనుగ్రహ భాషణంలో ధర్మ రక్షణ ప్రతీ ఒక్కరి ధ్యేయంగా సమాజం అడుగులు వేయాలని సందేశం ఇచ్చారు. వేద విద్యను ప్రతీ ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో నిత్య ధర్మాచరణ అత్యంత కీలకమని అప్పుడే ధర్మ రక్షణ సాధ్యమని స్వామి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం కొండా మోహన శర్మ, చింతలపాటి రామ్ ప్రసాద్, ఉమా శంకర శర్మ ఆధ్వర్యంలో జరిగింది. వక్తలు తెన్నేటి హరీశ్, సూర్య కిరణ్ శర్మ ధర్మాచరణ ప్రాధాన్యత వివరించారు.
Read more

