ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

GIR వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన.. గూస్‌బమ్స్ : ఎంపీ సంతోష్

ABN, First Publish Date - 2022-05-05T16:25:55+05:30

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్ : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ (Santosh Kumar). ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటి మరో ముగ్గుర్ని నామినేట్ చేయాలనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతదేశ వ్యాప్తంగా నడుస్తోంది. స్వతహాగా ప్రకృతిప్రేమికుడైన ఎంపీ సంతోష్.. అందులో భాగంగానే సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.


తాజాగా.. ఈ కమిటీ సభ్యులు గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. సంతోష్ అధ్యక్షతన జైరామ్ రమేష్ గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా సంతోష్ రాసుకొచ్చారు. అంతేకాదు.. పార్కులో ఉన్న కొన్ని జంతవుల ఫొటోలను స్వయంగా తానే కెమెరాతో క్లిక్‌మనిపించారు. ఇందులో సింహాన్ని వివిధ ఫోజుల్లో ఎంపీ ఫొటోలు తీశారు.


గూస్‌బమ్స్ అంతే!

నేషనల్ పార్క్ సందర్శన అనేది ఎప్పటికీ మరిచిపోలేనిది. నిజంగా గూస్‌బమ్స్ అంతే.. అని సంతోష్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ప్రకృతి ప్రేమికులు, సంతోష్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ.. షేర్ చేస్తున్నారు. కాగా.. కొన్ని రోజులుగా ఈ కమిటీ ప్రస్తుతం గిర్ అభయారణ్యంలో స్టడీ టూర్ నిర్వహిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మల్దారీస్ అనే గిరిజనులతో కూడా ఇదివరకే మమేకమైన ఈ కమిటీ వారితో కలిసి ఆడిపాడింది. అడవిలో వారు సాగిస్తున్న జీవన విధానాన్ని చూసి కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు. ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా హాయిగా జీవించొచ్చని సంతోష్ అభిప్రాయపడ్దారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!