ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఈ తల్లీ, కుమార్తెలకు ఖరీదైన చీరలంటే పిచ్చి.. కానీ డబ్బుల్లేవ్.. ఇందుకోసం ఏం చేశారో చూడండి..!

ABN, First Publish Date - 2022-05-03T20:12:22+05:30

తల్లి, కుమార్తెలకు ఖరీదైన చీరలు కట్టుకోవాలనే సోకు. కానీ అందుకు ఆర్థికస్తోమత సహకరించలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : తల్లి, కుమార్తెలకు ఖరీదైన చీరలు కట్టుకోవాలనే సోకు. కానీ అందుకు ఆర్థికస్తోమత సహకరించలేదు. అయితేనేం.. ఇంట్లో భర్తలకు తెలియకుండా బడా షోరూంలకు వెళ్లి ఖరీదైన చీరలను చోరీ చేయడం మొదలు పెట్టారు. చివరకు ఊచలు లెక్కబెడుతున్నారు. అంబర్‌పేట సలీంనగర్‌కాలనీకి చెందిన నల్లూరి సుజాత గృహిణి. ఆమె కుమార్తె నల్లూరి వెంకటలక్ష్మి. ఇద్దరూ ఖరీదైన చీరలు ధరించి విలాసవంతంగా ఉండాలని ఆశ. దీంతో ఇద్దరూ కలిసి బడా షోరూంలకు వెళ్లి చీరలు చూస్తున్నట్టు నటించి వాటిని తస్కరించడం ప్రారంభించారు.


ఈనెల 21న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 45లోని తలాషా క్లాత్‌ షోరూంకు వచ్చారు. రూ. లక్షా పదివేల విలువ చేసే ఐదు చీరలను చోరీ చేశారు. ఎవరూ గమనించలేదని నిర్ధారించుకొని 24న రోడ్డు నెంబరు 10లో గోల్డెన్‌ థ్రెడ్స్‌కు వెళ్లి రూ.2.80 లక్షలు విలువ చేసే చీరలు, జాకెట్‌లను చోరీ చేశారు. షోరూంల నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు తల్లి, కుమార్తెను అరెస్టు చేసి చీరలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!