Hyderabadలో ఘనంగా రంజాన్ వేడుకలు

ABN , First Publish Date - 2022-05-03T18:17:42+05:30 IST

Hyderabad: నగరంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Hyderabadలో ఘనంగా రంజాన్ వేడుకలు

Hyderabad: నగరంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా చార్మినార్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ బలగాలతో నిఘా పెట్టారు. అన్ని మసీదుల వద్ద ఇప్పటికే ప్రార్థనలు మొదలయ్యాయి. వేల సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొంటున్నారు. పాత బస్తీలో సున్నితమైన ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. చార్మినార్ వద్ద మక్కా మసీదు, మీరాలం దర్గా వద్ద ముస్లిం సోదరులు చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ప్రార్థనల కోసం వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలకు అనుమతి ఇస్తున్నారు. గతంలో తలెత్తిన సమస్యల కారణంగా.. ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Read more