Hyderabadలో పబ్‌లు.. బార్లపై నజర్‌.. సీపీ కీలక సూచనలు!

ABN , First Publish Date - 2022-05-14T12:07:03+05:30 IST

బంజారాహిల్స్‌లోని (Banjarahills)మింక్‌ అండ్‌ ఫుడింగ్‌ ఘటనతో పబ్‌లు, బార్లపై

Hyderabadలో పబ్‌లు.. బార్లపై నజర్‌..  సీపీ కీలక సూచనలు!

  • డ్రగ్స్‌ కనిపిస్తే కఠిన చర్యలు 
  • నిబంధనలు పాటించాలి 
  • యజమానులతో సీపీ మీటింగ్‌


హైదరాబాద్‌ సిటీ : బంజారాహిల్స్‌లోని (Banjarahills)మింక్‌ అండ్‌ ఫుడింగ్‌ ఘటనతో పబ్‌లు, బార్లపై (Pubs and Bar) సిటీ సీపీ దృష్టి సారించారు. డ్రగ్స్‌ మూలాలను అణచివేసే చర్యల్లో భాగంగా పబ్‌లు, బార్‌ల యజమానులతో సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand) శుక్రవారం సమావేశమయ్యారు. డ్రగ్స్‌ (Drugs) వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బుల నుంచి అధికస్థాయిలో ధ్వనులు వెలువడుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, సౌండ్‌ ప్రూఫ్స్‌ (Sound Proofs) వాడాలని యజమానులకు సూచించారు. రహదారులపై పార్కింగ్‌, బార్లు, పబ్బుల నుంచి మద్యం తాగి బయటకు వచ్చిన  కొందరు రహదారులపై (Roads) వెళ్లే వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాలను సీపీ ప్రస్తావించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం కొనసాగించాలని సమావేశానికి హాజరైన క్లబ్‌, పబ్‌, బార్ల (Club) యజమానులకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


నిర్వాహకులకు సీపీ సూచనలు

- 30 రోజుల బ్యాక్‌పతో కూడిన సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి.

- వినియోగదారులను మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించుకోవాలి.

- మైనర్లను పబ్‌లు, బార్లలోకి అనుమతించరాదు.

- రాత్రి 11 తర్వాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించకూడదు.

- రాత్రి 12 గంటలలోపు మూసివేయాలి.

- శుక్ర, శని వారాల్లో లావాదేవీలు, లెక్కింపు వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా ఓ గంట మినహాయింపు.

- అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు లైట్లను డిమ్‌ చేయాలని, తద్వారా కస్టమర్లు మూసివేసే సమయమైందని తెలుసుకుంటారు.

- అంతర్జాతీయ ప్రయాణికులు, ప్రతినిధులను దృష్టిలో  పెట్టుకొని స్టార్‌ రేటింగ్‌ ఉన్న హోటళ్లలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు సర్వ్‌ చేయరాదు.

Read more