ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

HYD : దక్షిణమధ్య రైల్వేకు కాసుల వర్షం

ABN, First Publish Date - 2022-05-07T19:09:39+05:30

దక్షిణ మధ్య రైల్వే కొవిడ్‌ తెచ్చిన నష్టాన్ని క్రమేపీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • ఏప్రిల్‌లో రికార్డుస్థాయిలో రూ.370 కోట్ల ఆదాయం


హైదరాబాద్‌ సిటీ : దక్షిణ మధ్య రైల్వే కొవిడ్‌ తెచ్చిన నష్టాన్ని క్రమేపీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. మునుపెన్నడూలేని రీతిలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో 370.05 కోట్ల ఆదాయంతో రికార్డు సృష్టించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్ల పరిధిలో కొవిడ్‌కు ముందు రోజుకు సగటున 726 రైళ్లు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం అన్ని డివిజన్లలో 292 రైళ్లు నడుస్తున్నాయి. వీటితోపాటు గత ఏప్రిల్‌లో 250 ప్రత్యేక రైళ్లను నడిపించారు. ఏప్రిల్‌ 13 నుంచి 17 వరకు ఐదు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు అంబేడ్కర్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడే, రెండో శనివారం, ఆదివారం ఇలా.. వరుస సెలవులు రావడంతో  ప్రయాణికుల రాకపోకల సంఖ్య బాగా పెరిగింది. ఈ ఐదు రోజుల్లో రూ.57.62 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్‌, విజయవాడ డివిజన్లలో రోజుకు లక్షన్నర మందికిపైగా ప్రయాణించినట్లు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!