ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఐపీఎస్‌ అధికారిణికి వేధింపులు

ABN, First Publish Date - 2022-05-11T16:21:41+05:30

పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారిణిని అసభ్య సందేశాలతో వేధింపులకు గురిచేస్తూ వెంబడిస్తున్న అమెరికా గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమెరికా గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ అరెస్ట్‌ 

హైదరాబాద్/బంజారాహిల్స్‌: పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారిణిని అసభ్య సందేశాలతో వేధింపులకు గురిచేస్తూ వెంబడిస్తున్న అమెరికా గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అమృత్‌సర్‌కు చెందిన మల్‌రాజ్‌సింగ్‌ ఔలక్‌ (29) అమెరికా కాలిఫోర్నియాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పంజాబ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణికి ఫోన్‌లో అసభ్య సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అధికారిణి స్పెషల్‌ ఫౌండేషన్‌ కోర్సులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం హాస్టల్‌లో ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. అమెరికా నుంచి పంజాబ్‌ వచ్చిన మల్‌రాజ్‌, ఆమె హైదరాబాద్‌లో ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు. ఎంసీహెచ్‌ఆర్‌డీ హాస్టల్‌వద్దకు వెళ్లి ఆమెను కలిసే ప్రయ త్నం చేశాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో, వారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారమందించారు. నిందితుడిపై  కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!