ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కబ్జాదారులపై కఠినచర్యలు తీసుకుంటాం

ABN, First Publish Date - 2022-05-11T17:19:45+05:30

భూకబ్జాదారులు, రౌడీషీటర్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీ్‌సకమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. మంగళవారం ఉదయం బాలానగర్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల: భూకబ్జాదారులు, రౌడీషీటర్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీ్‌సకమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. మంగళవారం ఉదయం బాలానగర్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీ్‌సస్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌తోపాటు ఆయా స్టేషన్‌లలో రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసులు వివరాలు, సిబ్బంది పనితీరును సీపీ పరిశీలించారు. మహిళా సిబ్బంది, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, ఇతర ప్రమాదకరమైన డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగద్గిరిగుట్ట పరిధిలో రౌడీషీటర్‌లు, ఆకతాయిల బెడద తప్పించేందుకు పెట్రోలింగ్‌ పెంచాలని సీఐని ఆదేశించారు. రౌడీషీటర్‌లపై నిఘా కొరవడిందని, భూకబ్జాదారుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్‌ డీసీపీ గోనె సందీప్‌, ఏసీపీ పురుషోత్తమ్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్‌ సీఐలు ఎండీ వహీదుద్దీన్‌, కె.బాలరాజు, పి.సైదులు, ఎస్‌బీ సీఐ మహేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!