రాష్ట్రానికి రెండు క్యాథల్యాబ్‌ల మంజూరు
ABN , First Publish Date - 2022-05-14T08:11:52+05:30 IST
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు క్యాథల్యాబ్‌లను మంజూరు చేసింది.
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు క్యాథల్యాబ్‌లను మంజూరు చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఖమ్మం జిల్లా హాస్పిటల్, వరంగల్ ఎంజీఎంలో క్యాథల్యాబ్స్ ఉన్నాయి. కొత్త ల్యాబ్‌లను సిద్దిపేట్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏవైనా రెండు టీచింగ్ హాస్పిటల్స్‌లో పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, గాంధీ ఆస్పత్రిలో క్యాథల్యాబ్ పాడవడంతో కొత్త ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.

