కుటుంబ పార్టీలు దోచుకుంటున్నాయి

ABN , First Publish Date - 2022-05-14T08:31:35+05:30 IST

దేశంలో కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని, సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన ప్రపంచంలోనే చెత్త పాలన అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు.

కుటుంబ పార్టీలు దోచుకుంటున్నాయి

  • కేసీఆర్‌ కుటుంబం నుంచి ఐదుగురు పాలన
  • రూ.7 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలి: కేఏ పాల్‌

న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని, సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన ప్రపంచంలోనే చెత్త పాలన అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. శ్రీలంకలో ఒక కుటుంబం నుంచి ఐదుగురు పాలించారని, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్‌ కుటుంబం నుంచి ఐదుగురు పాలిస్తున్నారని అన్నారు. శుక్రవారం పాల్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అప్పుగా తెచ్చిన రూ.7 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించానని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయిపోయిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 41 సహా దక్షిణాదిలో 150, ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో 25 మొత్తం 178 లోక్‌సభ సీట్లలో గెలుస్తామని షాకు చెప్పినట్టు వివరించారు. ఓటు బ్యాంకు లేని పవన్‌కల్యాణ్‌ వెంట ఎందుకు పడుతున్నారని షాను ప్రశ్నించానని.. పవనే తమ వెంటపడుతున్నారని ఆయన బదులిచ్చారని తెలిపారు. 

Read more