బంజారా జేఏసీ ఉద్యమానికి వినోద్ మద్దతు
ABN , First Publish Date - 2022-05-14T09:15:48+05:30 IST
ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన కాంట్రాక్టర్, తమ కుల దైవం కింగ్ శూర్ వీర్ లఖిషా బంజారా విగ్రహాన్ని ఆ కోటలో ప్రతిష్ఠించడానికి బంజారా జేఏసీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మద్దతు పలికారు.
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన కాంట్రాక్టర్, తమ కుల దైవం కింగ్ శూర్ వీర్ లఖిషా బంజారా విగ్రహాన్ని ఆ కోటలో ప్రతిష్ఠించడానికి బంజారా జేఏసీ చేపట్టిన జాతీయ స్థాయి ఉద్యమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మద్దతు పలికారు. ఈ మేరకు శుక్రవారం తనను కలిసిన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల బంజారా జేఏసీ నేతలు వినోద్‌తో మాట్లాడారు. ఎర్రకోటలో విగ్రహ ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. బంజారా కులస్తుల రిజర్వేషన్ విధానం జాతీయ స్థాయిలో ఒకే విధంగా ఉండాలంటూ సాగిస్తున్న ఉద్యమానికి కూడా మద్దతు పలకాలని అడిగారు. జేఏసీ డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ వారికి భరోసా ఇచ్చారు.

