కేటీఆర్ సభలో ఖాళీ కుర్చీలు
ABN, First Publish Date - 2022-05-11T08:56:17+05:30
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం మొదలైందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం మొదలైంది: ఠాగూర్
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం మొదలైందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. మంత్రి కేటీఆర్ మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన సభకు జనాలే రాలేదని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీ కుర్చీలు ఉన్న వీడియోను ఠాగూర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇది మంత్రి పబ్లిక్ మీటింగా..? ఖాళీ కుర్చీల మీటింగా..? కొడుకు, అల్లుడితో సహా టీఆర్‌ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 300 లేదా 420 రోజులే అధికారంలో ఉంటుంది. సర్కారు పతనం మొదలైంది’’ అని ట్వీట్ చేశారు.