Jeevitha Rajasekhar: జీవితకు సైబర్ నేరగాళ్ల కుచ్చు టోపి.. సగం ధరకే బహుమతులు ఇస్తామంటూ...
ABN, First Publish Date - 2022-11-26T17:25:08+05:30
సినీ నటి జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపి పెట్టారు. జియో బహుమతుల పేరుతో ...
Jeevitha Rajasekhar
హైదరాబాద్: సినీ నటి జీవితారాజశేఖర్‌కు సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపి పెట్టారు. జియో బహుమతుల పేరుతో మోసం చేశారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ చీట్ చేశారు. తెలిసినవారి పేరు చెప్పి ఆమెను మోసం చేశారు. తెలిసినవాళ్లని నమ్మిన జీవిత లక్షన్నర బదిలీ చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నైకి చెందిన నరేష్‌ని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన నరేశ్ గతంలోనూ నటీనటులతోపాటు నిర్మాతలను మోసం చేసినట్లు తెలిసింది.
Updated Date - 2022-11-26T17:25:10+05:30 IST