తెలంగాణలోనూ సీపీఎస్‌ రద్దు చెయ్యాలి

ABN , First Publish Date - 2022-05-14T09:16:58+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సర్కారు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స)ను రద్దు చెయ్యాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

తెలంగాణలోనూ సీపీఎస్‌ రద్దు చెయ్యాలి

ఉద్యోగ సంఘాల డిమాండ్‌

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సర్కారు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స)ను రద్దు చెయ్యాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎ్‌స) పునరుద్ధరించాలని కోరాయి. ఈ మేరకు సీపీఎస్‌ రద్దు అంశంలో సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలని కోరుతూ టీసీపీఎ్‌సఈఏ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇక, సీపీఎ్‌సను రద్దు చేసి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, రాష్ట్రంలోనూ రద్దు చేయాలని సీపీఎ్‌సటీఈఏటీఎస్‌ డిమాండ్‌ చేసింది. 

Read more