ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పారామెడికల్‌ బోర్డు స్థానంలో కౌన్సిల్‌

ABN, First Publish Date - 2022-05-08T08:51:18+05:30

రాష్ట్రంలో పారామెడికల్‌ కోర్సులపై పర్యవేక్షణ చేస్తున్న బోర్డు త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో పారామెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరుకు ఉత్తర్వ్యులు జారీ కానున్నాయి. ప్రస్తుతం బోర్డు పరిధిలో కేవలం డిప్లొమా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏర్పాటుకు ఈ నెలాఖరుకు సర్కారు జీవో

కౌన్సిల్‌తో డిప్లొమాతోపాటు డిగ్రీ, పీజీ కోర్సులు

ప్రవేశాలకు నీట్‌ తరహాలో జాతీయ అర్హత పరీక్ష


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారామెడికల్‌ కోర్సులపై పర్యవేక్షణ చేస్తున్న బోర్డు త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో పారామెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరుకు ఉత్తర్వ్యులు జారీ కానున్నాయి. ప్రస్తుతం బోర్డు పరిధిలో కేవలం డిప్లొమా కోర్సులనే ఆఫర్‌ చేస్తున్నారు. మొత్తం 19 రకాల పారామెడికల్‌ డిప్లొమా కోర్సులున్నాయి. బోర్డు స్థానంలో కౌన్సిల్‌ ఏర్పాటు తర్వాత డిప్లొమాతోపాటు నాలుగేళ్ల, ఆరేళ్ల డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మొత్తం 54 రకాల కోర్సులు ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌, ఫార్మసీ కోర్సులు నాలుగు తప్ప.. మిగిలినవన్నీ ఈ కౌన్సిల్‌ పరిధిలోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా పారామెడికల్‌ డిప్లొమా కోర్సులన్నింటినీ ఒకే గొడుగుకు కిందకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ది నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్‌ యాక్ట్‌-2021ను గతేడాది మార్చి 28 కేంద్రం తీసుకువచ్చింది. అదే ఏడాది మే 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.


దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ యాక్టును అడాప్ట్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఆ యాక్ట్‌ ప్రకారం రాష్ట్రాలు తమ వద్ద పారామెడికల్‌ బోర్డు ఉంటే దాని స్థానంలో కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఏదీ లేకుంటే కొత్తగా పారామెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆ చట్టం చెబుతోంది. అందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. అంటే గతేడాది నవంబరు 25 వరకు అన్ని రాష్ట్రాలు విఽధిగా పారామెడికల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే గతేడాది కొవిడ్‌ కారణంగా కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలలపాటు పెంచింది. దీంతో ఈ నెల 25 వరకు అన్ని రాష్ట్రాలు విధిగా కొత్తగా  పారామెడికల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. మన రాష్ట్రం ఇప్పటికే ఆ యాక్టును అడాప్ట్‌ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫైల్‌ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. ఈ నెల 25లోగా కౌన్సిల్‌ ఏర్పాటు ఉత్తర్వ్యులను అధికారికంగా జారీ చేయనుంది. ఆ తర్వాత నుంచి కార్యకలాపాలన్నీ పారామెడికల్‌ కౌన్సిల్‌ పేరిటే జరగనున్నాయి. పారామెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు తర్వాత ఆ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా జాతీయ అర్హత పరీక్ష ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందులో అర్హత సాధిస్తేనే పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. ఈ తరహా విధానం వల్ల నాణ్యమైన పారామెడికల్‌ విద్య అందుబాటులోకి వస్తుందని అఽధికారులు చెబుతున్నారు. 


కౌన్సిల్‌ ఏర్పాటు తర్వాత ఉండే కోర్సులివే..

బయో టెక్నాలజిస్టు, బయో కెమిస్టు(నాన్‌ టెక్నికల్‌) సెల్‌ జెనిటిసిస్టు, మైక్రోబయాలజిస్టు(నాన్‌ క్లినికల్‌) మాలిక్యులర్‌ బయాలజిస్టు(నాన్‌) మాలిక్యులర్‌ జెనిటిసిస్టు, సైటో టెక్నాలజిస్టు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ టెక్నాలజిస్టు (టీ), హిస్టో టీ, హెమటో టీ, మెడికల్‌ ల్యాబ్‌ టీ, అడ్వాన్‌ కేర్‌ పారామెడిక్‌, బర్న్‌కేర్‌ టీ, ఎమర్జెన్సీ మెడికల్‌ టీ, అనస్థీషియా అసిస్టెంట్స్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టీ, ఎండోస్కొపీ అండ్‌ ల్యాప్రోస్కోపీ టీ, ఫిజియోథెరపిస్టు, డైటీషియన్‌, న్యూట్రిషనిస్టు, ఆప్టోమెట్రిస్టు, ఆప్తమాలిక్‌ అసిస్టెంట్‌, విజన్‌ టెక్నీషియన్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్టు, ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ఎకాలజిస్టు, కమ్యూనిటీ హెల్త్‌ ప్రమోటర్స్‌, ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, సైకాలజిస్టు,  బీహేవియరల్‌ ఎనలిస్టు, ఇంటిగ్రేటెడ్‌ బీహేవియర్‌ హెల్త్‌ కౌన్సిలర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌, సోషల్‌ వర్కర్‌, హెచ్‌ఐవీ లేదా ఫ్యామిలీ కౌన్సిలర్‌, మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ వర్కర్స్‌,  పొడియాట్రిస్టు, పాలియేటివ్‌ కేర్‌ ప్రొఫెషనల్‌, మూవ్‌మెంట్‌ థెరపిస్టు, మెడికల్‌ ఫిజియోసిస్టు, న్యూక్లియర్‌ మెడికల్‌ టెక్నాలజిస్టు, రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజిస్టు,  రెడియోథెరపీ, డోసిమెట్రిస్టు, యోమెడికల్‌ ఇంజనీర్‌, మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ టెక్నీషియన్‌, కార్డియోవ్యాస్కులర్‌ టెక్నీషియన్‌, ఫెరిప్యూజనిస్టు, రెస్పిరేటర్‌ టెక్నాలజిస్టు, ఈసీజీ టెక్నాలజిస్టు, డయాలసిస్‌ థెరపీ, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెట్‌ టెక్నాలజిస్టు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!