ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ నిరోధానికి కమిటీ

ABN, First Publish Date - 2022-05-14T08:53:13+05:30

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్ల బ్లాకింగ్‌ వ్యవహారానికి చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్ల బ్లాకింగ్‌ వ్యవహారానికి చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. కౌన్సెలింగ్‌ విధానంలో ఉన్న లోపాలను గుర్తించి, కొత్త పద్ధతిని రూపొందించేందుకు ఓ కమిటీని నియమించాలని ఈసందర్భంగా నిర్ణయించారు. కాళోజీ హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌  ప్రవీణ్‌ కుమార్‌, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఇద్దరు మెడికల్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు లీగల్‌ అడ్వైజర్లతో కమిటీని ప్రతిపాదించారు. సీటు బ్లాకింగ్‌, సీటు స్లైడింగ్‌, రిజిర్వేషన్ల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులపై ఈ కమిటీ దృష్టిసారించనుంది. అలాగే మన రాష్ట్రంలో మెడికల్‌ రిసెర్చ్‌ సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.  వైద్య పరిశోధనల కోసం కూడా ఒక విధానాన్ని సిద్ధం చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. అందుకోసం కూడా ఒక కమిటీని వేయనుంది. ఇందులో డీఎంఈ రమేశ్‌రెడ్డితో పాటు ప్రముఖ డాక్టర్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, గచ్చిబౌలి టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలా థామస్‌ ఉండనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!