ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పల్లె ప్రగతిపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ (vedio conference)

ABN, First Publish Date - 2022-05-13T18:38:37+05:30

పల్లె ప్రగతిని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆయన జిల్లా స్థాయి అధికారులతో గురువారం పల్లె ప్రగతి, హరితహారం,

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 మహబూబాబాద్‌: పల్లె ప్రగతిని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు.  కలెక్టరేట్‌ నుంచి ఆయన జిల్లా స్థాయి అధికారులతో గురువారం పల్లె ప్రగతి, హరితహారం, దళితబంధు, ఉపాధిహామీ పనులపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి 5వ విడతలతో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన, హరితహారం, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, గ్రామస్థుల భాగస్వామ్యంతో శ్రమదానం చేపట్టాలని సూచించారు. వైకుంఠధామాలు, సిగ్రిగేషన్‌ షెడ్‌లను పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించే విధంగా చూడాలన్నారు. మండలంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మంగళవారంలోగా జిల్లాస్థాయి సన్నాహాక సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యాక్షన్‌ప్లాన్‌ తయారు చేసుకుని మొక్కలు నాటేందుకు సరైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.  

 పంచాయతీ సెక్రటరీలు సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మండలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతీ ఇంటికి మొక్కలు అందించాలన్నారు. అనంతరం దళితబంధుపై సమీక్షించారు. మండల అధికారులు తమ పరిధిలో పెండింగ్‌ లేకుండ యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని అన్నారు. ఉపాధిహామీలో ప్రతి జీపీలో 200 మంది పనులకు వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు రమాదేవి, సన్యాసయ్య, సాయిబాబా, నర్మద, బాలరాజు, దిలీ్‌పకుమార్‌ పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!