రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూత
ABN , First Publish Date - 2022-05-12T14:22:09+05:30 IST
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు

హైదరాబాద్ : రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు.