బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలి: షబ్బీర్‌ అలీ

ABN , First Publish Date - 2022-05-03T00:58:31+05:30 IST

రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలి: షబ్బీర్‌ అలీ

హుజూరాబాద్‌: రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు నష్టపోతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేదని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షన సభను విజయవంతం చేయాలని షబ్బీర్‌ అలీ కోరారు.

Read more