Telanganaకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-05-09T23:51:04+05:30 IST

లంగాణకు బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Telanganaకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేటీఆర్

నారాయణపేట: తెలంగాణకు బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. జాతీయ పార్టీ నేతలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చెప్పినట్లు.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిందేమీలేదు కానీ.. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉర్దూ భాషపై విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉర్దూ ఉంటే తప్పు లేదు కానీ.. ఇక్కడ ఉర్దూ ఉంటే వద్దంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Read more