ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

స్థలాలు టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకేనా?

ABN, First Publish Date - 2022-05-14T08:49:54+05:30

‘‘గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించుకునేందుకు గరిష్ఠంగా ఎకరం స్థలం కేటాయింపు’’ - జూలై నెల 2018లో రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • మిగిలిన పార్టీలకు మొండి చెయ్యేనా? 
  • విపక్ష పార్టీల్లో పెరుగుతున్న అసహనం
  • తమకూకేటాయించాలంటూ డిమాండ్‌


హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించుకునేందుకు గరిష్ఠంగా ఎకరం స్థలం కేటాయింపు’’ - జూలై నెల 2018లో రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం మేరకు ఇప్పటి దాకా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి స్థలాలు కేటాయించడమే కానీ.. విపక్షాలకు మాత్రం మొండి చెయ్యి చూపుతున్నారన్న విమర్శలు ఆయా పార్టీల నుంచి వస్తున్నాయి. అసలు సొంత పార్టీ జిల్లా కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకోవడం కోసం తీసుకున్న నిర్ణయం ఇదని, విమర్శలు రాకుండా విపక్షాలకూ కేటాయించనున్నట్లుగా ప్రకటించారని ఆయా విపక్షాల నేతలు చెబుతున్నారు. పార్టీలకు కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలం కేటాయించాలన్న నిర్ణయం తీసుకోగానే.. ఆ దిశగా అధికార టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసుకుంటూ పోయింది. హైదరాబాద్‌ జిల్లా పార్టీకి స్థలం కేటాయింపుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎ్‌సకు స్థలాలు కేటాయించినట్లయింది. వరంగల్‌, హైదరాబాద్‌ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణమూ దాదాపు పూర్తయింది. 


అయితే ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించిన విపక్ష పార్టీలు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ స్థలాల మంజూరు కోసం తిరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలకు కార్యాలయాలు ఉన్నాయి. అయితే పార్టీ కార్యాలయాలు లేని జిల్లాల్లో స్థలాల కోసం విపక్ష పార్టీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే కాంగ్రె్‌సకు కార్యాలయాలు లేని జిల్లాల్లో స్థలాల కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్లకు దరఖాస్తులు పెట్టించారు. పర్యవేక్షణ బాధ్యతను అప్పటి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు అప్పచెప్పారు. అయితే స్థలాల కోసం కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ స్థానిక నాయకత్వం చక్కర్లు కొట్టినా ఏ ఒక్క చోటా ఇంతవరకు స్థలం కేటాయించలేదని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులు ఎంపిక చేసిన స్థలాలపైన కొర్రీలు పెడుతూ.. ఇతర కారణాలు చూపుతూ ప్రతిపాదనను పెండింగ్‌లో పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు లేని జిల్లాల్లో స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా ఇంతవరకు కేటాయింపులు జరగలేదు. ఉభయ వామపక్షాల జిల్లా కమిటీలూ స్థానికంగా దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు కదలిక లేదు. అయితే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ - 12లో రూ.కోట్ల విలువైన స్థలాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి నగర కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడంతో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల్లో మళ్లీ వేడి పెరిగింది. తమకూ స్థలాలు కేటాయించాల్సిందిగా ఆయా పార్టీల నేతలు డిమాండ్‌ వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!